కలలో వినాయకుడు కనపడితే ఏం జరుగుతుంది..? మంచిదేనా..?

-

నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. కలలు అంటే రకరకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే కలలు వస్తే.. కొన్ని కొన్ని సార్లు పీడకలలు వస్తాయి. ఒకవేళ కలలో వినాయకుడు కనపడితే దాని అర్థం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కలలో కనక వినాయకుడు కనపడితే మార్పులు చోటు చేసుకుంటాయట.

తొండం తో వినాయకుడు

ఇలా కలలో కనపడితే మీ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోందని అర్థం. వినాయకుడు జ్ఞానం, అర్థం చేసుకోవడం, కష్టాల నుంచి బయటకు రావడాన్ని సూచిస్తారు. తొండంతో వినాయకుడు కలలో కనపడితే మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడతారని దానికి అర్థం.

ఎక్కువ తలలతో వినాయకుడు

కలలో ఎక్కువ తలలతో వినాయకుడు కనపడితే మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని మీరు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని అర్థం. ఇలా వినాయకుడు కనపడితే మీరు మీ సమస్యల నుంచి బయట పడతారని అర్థమని పండితులు తెలిపారు.

ఎలుకతో వినాయకుడు

కలలో ఎలుకతో వినాయకుడు కనపడితే కచ్చితంగా మీరు అలర్ట్ గా ఉండాలని, చిన్న సమస్యల్ని కూడా తేలికగా తీసుకోకుండా వాటిపై ధ్యాస పెడితే సులువుగా వాటి నుంచి బయటపడొచ్చుట.

లడ్డుతో వినాయకుడు

లడ్డు, గొడ్డలి లేదా ఇతర వాటితో వినాయకుడు కనిపిస్తే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలట. తామర పువ్వు తో కనబడితే కూడా మంచిదట. గొడ్డలితో కనబడితే నెగిటివిటీని తొలగించి హాయిగా గడపమని అర్థం.

పండుగ వాతావరణంలో వినాయకుడు

పండుగ వాతావరణంలో వినాయకుడి కనబడితే మీ లైఫ్ లో సక్సెస్ ని అందుకోబోతున్నారని అర్థం. అదృష్టం కూడా కలిసి రాబోతుందని దానికి సంకేతం.

వినాయకుడి పూజ చేస్తున్నట్లు

వినాయకుడు పూజ చేస్తున్నట్లు కలలు వచ్చినట్లయితే జీవితంలో ఎదుగుదల ఉంటుందట. పెద్ద మార్పు చోటు చేసుకుంటుందట. అదే బాల గణపతి కలలోకి వస్తే మీ జీవితం సంతోషమయంగా మారిపోతుందని అర్థం.

Read more RELATED
Recommended to you

Exit mobile version