పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు..? సైన్స్ ఏం అంటోంది..?

-

పెళ్లి అంటే ఎన్నో రకాల పద్ధతుల్ని పాటించడం జరుగుతుంది. పెళ్ళిలో సంప్రదాయానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. పెళ్లిలో ఏడడుగులు వేయడం తాళి కట్టడం జీలకర్ర బెల్లం ఇలా ఎన్నో ఉంటాయి. హిందూ వివాహాలలో అరుంధతి నక్షత్రాన్ని వరుడు వధువుకి చూపిస్తారు ముఖ్యమైన సంప్రదాయం. ఇది ఎన్నో తరాల నుండి కూడా ఈ సాంప్రదాయం వస్తుంది పగటి కూడా జరిగే పెళ్లిళ్లలో కూడా ఈ సాంప్రదాయం ఉంటుంది. అయితే అసలు దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి ఎందుకు అరుంధతి నక్షత్రాన్ని వరుడు వధువుకి చూపిస్తాడు అనే విషయాన్ని చూద్దాం.

16వ శతాబ్దపు తమిళ కవి తాండవరాయ స్వామి ఒక గ్రంథాన్ని రాశారు భౌతిక ఊహజనహితమైన వస్తువులను చూడడానికి సంబంధించిన విషయాలని ఆ గ్రంథంలో రాశారు. అందులో ఆయన దగ్గరలో ఉండే వృక్షాలను చూపించి.. తర్వాత వెనుక ఉండే చందమామని ఆ తర్వాత నక్షత్రాల గుంపును ముందుగా చూపించి వాటిలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అని రాశారు.

ఆకాశంలో ఓ జంట నక్షత్రాల్లో ఒకటి స్థిరంగా ఉంటే ఒకటి మొదటి నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వశిష్ట అరుంధతి జంట నక్షత్రాలు ఆదర్శ జంటలు. రెండు కూడా ఒకదాని చుట్టూ ఇంకోటి తిరుగుతూ ఉంటాయి. వేలనాటి నుండి ఈ నక్షత్రాలను చూసి సాంప్రదాయాన్ని పెట్టారంటే ఆశ్చర్యంగా ఉంది కదా అని ఈ విషయాన్ని ఒక అమ్మాయి వీడియో ద్వారా చెప్పింది. అప్పటి సాంప్రదాయం గురించి చెప్పి నమ్మశక్యంగా లేదని చెప్పింది. విజ్ఞాన్ ప్రసార్ లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఒక ఆయన ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నిజం కాదని దానికి కారణాలు కూడా చెప్పారు.

రెండు నక్షత్రాలు ఉంటాయి. రెండు కూడా తిరగవు రెండు స్టార్ల మధ్య ద్రవ్య రాశి కేంద్రం చుట్టూ అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పారు. అరుంధతిగా పరిగణించే అల్కర్ నక్షత్రం కి అల్కర్ బి అని జంట స్టార్ ఉంది. అల్కర్ అల్కర్ బి అనేవి రెండు జంట నక్షత్రాలు అని ఆయన చెప్పారు. అల్కర్ నక్షత్రంనే అరుంధతి నక్షత్రం అని అంటారు. ఒకే దిశలో అవి రెండు ఉండడం వలన ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా నక్షత్రాలు జంటగా కనబడతాయి అది కేవలం భ్రమ అని అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట నక్షత్రాలని భార్య భర్తలుగా భావించి అలా కలిసి ఉండమని అంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version