టీటీడీ శ్రీవారి 2020 క్యాలెండర్లు విడుదల!

-

మరో మూడువారాల్లో కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్‌లు అందరూ తీసుకుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇష్టపడే క్యాలెండర్‌ శ్రీవారి టీటీడీ క్యాలెండర్‌. ఏటా వీటిని టీటీడీ ముద్రించి భక్తులకు విక్రయిస్తుంది. ఈ ఏడాది వీటి ముద్రణ పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి ఫోటోలతో కూడిన క్యాలెండర్లు, డెయిరీల కొనుగోలు చేయడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం క్యాలెండర్లు, డెయిరీలను టీటీడీ సభ్యులు ఆవిష్కరించారు.

డిసెంబరు మొదటివారం నుంచి అన్ని టీటీడీ సమాచారా కేంద్రాల్లోనూ అమ్మకాలు. మొత్తం 20 లక్షలకుపైగా క్యాలెండర్లు, 8 లక్షల డెయిరీలను టీటీడీ ముద్రించింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఒక్కోటి రూ.100లుగా ఉన్న 12 షీట్లు క్యాలెండర్లు 12 లక్షలు, రూ.15 ధర ఉన్న శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, రూ.15 విలువైన అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, రూ.10 ఖరీదైన శ్రీవారు, అమ్మవారి చిన్న క్యాలెండర్లు 4 లక్షలు ముద్రించి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.

అలాగే, ఒక్కోటి రూ.20 ధర ఉన్న తెలుగు పంచాంగం క్యాలెండర్లు లక్ష కాపీలు, మొత్తం ఆరు లక్షల పెద్ద డెయిరీలు, లక్షన్నర చిన్న డెయిరీలను ముద్రించినట్టు తెలియజేశారు. పెద్ద డెయిరీ ధర రూ.130, చిన్న డెయిరీ ధర రూ.100గా నిర్ణయించినట్టు తెలియజేశారు. టేబుల్ టాప్ క్యాలెండర్లు 75 వేలు ముద్రించామని, వీటి ఒక్కో ధర రూ.40గా నిర్ణయించినట్టు వివరించారు.

డిసెంబరు 1 నుంచి తిరుమల, తిరుపతిలోని విక్రయ కేంద్రాలతోపాటు అన్ని సమాచార కేంద్రాల్లోనూ టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంటాయని సుబ్బారెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసేవారు ఆన్‌లైన్లో వీటిని బుక్‌ చేసుకుని పొందవచ్చు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version