Vinayaka Chaturthi 2024: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి నాడు హిందువులు పెద్ద ఎత్తున వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు. వీధుల్లో కూడా వినాయక విగ్రహాలని పెట్టి నవరాత్రులని ఘనంగా జరుపుతారు. అయితే వినాయక చవితి నాడు గణపయ్య విగ్రహం కొనేటప్పుడు కొన్ని తప్పులు చేయకండి. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి. లేదంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. అయితే వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించినా లేదంటే వీధిలోని మండపంలో ప్రతిష్టించినా మార్కెట్ నుంచి ఎలాంటి విగ్రహాన్ని కొని తెచ్చుకోవాలి అనే దాని గురించి పండితులు చెప్పారు. జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం వినాయక విగ్రహ తొండం ఎడమవైపుకి వంగి ఉండాలి. కాబట్టి ఈ పొరపాటు లేకుండా చూసుకోండి.
అన్ని రకాలు శుభాలు కలగాలంటే వినాయకుని తొండం ఎడమవైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పులు, కష్టాలు తీరుతాయి. ధన లాభం కూడా కలుగుతుంది అని పండితులు అంటున్నారు. మార్కెట్ నుంచి కూర్చున్న భంగిమలో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందట. వినాయకుడు తన వాహనమైన ఎలుక లేదా ఏమైనా సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు ఉంటే మరీ మంచిది. అలాగే వినాయకుడిని కొనేటప్పుడు ఎకో ఫ్రెండ్లీని పాటించడం మంచిది. హానికరమైన రంగులు ఉండే వాటిని కంటే మట్టి విగ్రహాలని లేదంటే పర్యావరణానికి మేలు చేసే వాటిని కొనుగోలు చేయడం మంచిది.
పర్యావరణానికి హాని చేసే వాటిని కొనుగోలు చేయకండి. మట్టి వినాయకుడిని కొనుగోలు చేయడం వలన చెరువులో త్వరగా అవి కలిసిపోతాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్ ఉండే వాటిని కొందరు కొంటూ ఉంటారు. అవి ఆకర్షణంగా కనబడతాయి తప్ప వాతావరణానికి మంచిది కాదు. వినాయక విగ్రహాలను కొనేటప్పుడు నలుపు రంగు వాటిని కొనుగోలు చెయ్యొద్దు. నలుపు నెగిటివ్ ఎనెర్జీని కలిగించి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది కాబట్టి ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి.