మేడారం జాతరకు వరంగల్ డిపోకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి 250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు బుధవారం తెలిపారు. 30 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడి నుంచైనా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. దేవరకొండ నుంచి 30, నల్లగొండ నుంచి 40, నార్కెట్ పల్లి నుంచి 32, మిర్యాలగూడ నుంచి 30, సూర్యాపేట నుంచి 53, కోదాడ నుంచి 25 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి ఆర్ఎం రాజేంద్రప్రసాద్ తెలిపారు.