మాజీ సీఎం YS జగన్ కడప జిల్లా పర్యటన పై ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. దేశంలో వైఎస్ జగన్ కు ఉన్న చరిష్మా ఎవరికీ ఉండదు. స్వయం కృషితో పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జగన్ జిల్లాకు వచ్చారు. ఆయనను చూసేందుకు ప్రతి రోజూ తెల్లవారు జామున నుండే ఆయన నివాసం వద్దకు జనం తరలి వస్తున్నారు.
కానీ ఆయనకు వస్తున్న ప్రజధారణ చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా లో వస్తున్న కథనాలు దారుణంగా ఉన్నాయి. జగన్ ఇంటి పై రాళ్ళ దాడి అని ప్రసారం చేయడం విడ్డూరంగా ఉంది. వేలాది మందిగా జగన్ ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దానిపై కూడా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వేయడం సిగ్గుచేటు అని పేర్కొన రవీంద్రనాథ్ రెడ్డి.. రాష్ట్రంలో ప్రస్తుతం దరిద్రమైన పరిపాలన కొనసాగుతోంది అని పేర్కొన్నారు.