జగిత్యాల జిల్లాలో త్వరలో CM KCR పర్యటన సందర్బంగా సభ ఏర్పాట్ల కోసం TRS పార్టీ కార్యాలయం సమీపంలో సభా స్థలాన్ని బుధవారం MLA డా.సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ జి.రవితో కలసి పరిశీలించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. SP సింధు శర్మ, RDO మాధురి, DSP ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి, మున్సిపల్ DE రాజేశ్వర్, అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.