మేడారం మహాజాతరలో మొదటి కీలకఘట్టం పూర్తయింది. గిరిజనుల ఇలవేల్పులో ఒకరైన సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మేడారం వచ్చింది. డప్పు వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మను ఊరేగింపుగా గిరిజన పూజారులు తీసుకువచ్ఛారు. కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం నుంచి భారీ బందోబస్తు మధ్య ఊరేగింపుగా మేడారం తీసుకువచ్చి జంపన్నవాగు మీదుగా అమ్మవారిని గద్దెపైన ప్రతిష్టించారు. కార్యక్రమంలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.