NZ Vs BAN : రాణించిన బౌలర్లు.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపిలో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 236/9 పరుగులు చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఓపెనర్ నజముల్ హుస్సేన్ శాంటో 77 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు జాకిర్ అలీ కూడా 45 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు. ఓపెనర్ హాసన్ 24, రిషద్ హాసన్ 26 పరుగులు చేసారు.

ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మైకెల్ బ్రాస్ వెల్ 4 వికెట్లు తీయగా.. విలియమ్ రూర్కీ 2, హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు. దీంతో ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు గెలిస్తే.. బంగ్లాదేశ్ జట్టుతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version