
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 21 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8, వికారాబాద్ 0, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలన్నారు.