పది, ఇంటర్‌లో అడ్మిషన్లకు ఈ నెల 31 వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మండలాల్లోని అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ ఫారం పూర్తి చేసి సంబంధిత ధ్రువ పత్రాలతో మీసేవ, టీఎస్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 800 840 3520 నంబరును సంప్రదించాలని సూచించారు.