2024 ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపిద్దాం : ప్రశాంత్ కిశోర్

-

2024 స్వారత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి.. ఇంటికి పంపడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. వచ్చే నెలలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతి పక్షాలకు అనుకూలంగా రాకపోయినా.. సరే 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం సాధ్యమయ్యే పనేనని అని పేర్కొన్నారు. నిన్న ఓ జాతీయ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడారు.

Political Strategist Prasanth Kishor

బీజేపీని ఓడించడం అయ్యే పనేనన్న ప్రశాంత్‌ కిశోర్‌.. ప్రస్తుతం ఉన్న ప్రతి పక్షంతో మాత్రం అది సాధ్యం కాదని వెల్లడించారు. బీజేపీని బీజేపీ పార్టీ హిందూత్వ నినాదం, జాతీయ భావానికి తోడు సంక్షేమ పథకాల తో ఎన్నికలకు వెళుతోందని.. వీటిలో రెండింటినీ అయినా.. ప్రతి పక్షాలు అధిగమించాల్సి ఉంటుందని పీకే వెల్లడించారు. కాంగ్రెస్‌ లేకుండా బలమైన ప్రతి పక్షం సాధ్యం కాదన్న ఆయన.. బీజేపీని ఓడించేందుకు తగిన ప్రతి పక్షం ఏర్పాటులో తాను సాయపడతానని చెప్పుకొచ్చారు ప్రశాంత్‌ కిశోర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version