ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 317 జీవో ద్వారా కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులు పరస్పర బదిలీలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. తిరుపతి రెడ్డి, ఎం. జైపాల్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే తమను సంప్రదించవచ్చని సూచించారు.