
పోలీసుశాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా మిగతా ఇతర నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం పెంచడంతో చాలామందికి వెసులుబాటు లభించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య గణనీయంగానే పెరగనుంది. ఎక్స్ సర్వీస్ మెన్ లకు కూడా 47 ఏళ్ల వయస్సు వరకు గరిష్ఠ అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కోటాలోనూ పలువురు సర్కారీ కొలువు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.