15 ఏళ్లు దాటిన వాహనాలకు బంకుల్లో పెట్రోల్ బంద్..!

-

దేశ రాజధాని ఢిల్లీ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ముఖ్యంగా కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శనివారం పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో అధికారులు భేటీ అయ్యారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. “పెట్రోల్ బంకుల వద్ద గాడ్జెట్లు ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్లు పైబడిన వాహనాలను అవి గుర్తిస్తాయి. దాంతో వాటికి ఇంధనం అందదు” అని మంత్రి వెల్లడించారు.

ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇస్తామని తెలిపారు. అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90 శాతం సీఎబీ బస్సులను దశలవారీగా ఉపసంహరించుకొని, ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం ఢిల్లీ కాలుష్య కొరల్లో చిక్కుకుపోయే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version