హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంను శనివారం శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారి వెంట తిప్పర్తి జడ్పిటిసి, టిఆర్ఎస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.