భారత దేశ కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రుణాన్ని అందిస్తూ ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగింది. వాటిలో భాగంగా లఖ్పతి దీదీ యోజన స్కీం ను కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. ఇటువంటి పథకాలతో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని భావించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో సహాయం లభిస్తుంది.
దీనిలో భాగంగా మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలను అందించడం జరుగుతుంది, దీంతో ఆ రుణాన్ని ఉపయోగించి మహిళలు వ్యాపారాలను ప్రారంభం చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళల కోసం వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా శాతం మంది ఆర్థిక సమస్యలను తగ్గించేందుకు వ్యాపారాలను ప్రారంభించాలని భావిస్తారు. కాకపోతే సరైన ఆర్థిక సహాయం లేక ప్రారంభించరు. అలాంటప్పుడు ఈ పథకం ద్వారా రుణాన్ని ఎంతో సులభంగా పొంది వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.
అర్హత వివరాలు:
భారతదేశంలో నివసించే పౌరులు అందరూ ఈ పథకానికి అర్హులు మరియు 18 నుండి 50 సంవత్సరాలు వయసు గల మహిళలు లఖ్పతి దీదీ యోజన పధకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉండేటటువంటి మహిళలు కూడా ఈ పథకం ద్వారా రుణాన్ని పొందవచ్చు.
అప్లై చేసే విధానం:
లఖ్పతి దీదీ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ లో ద్వారా అప్లికేషన్ ను పొందవచ్చు. దానిలో అడిగిన వివరాలను పూరించిన తర్వాత అప్లికేషన్ తో పాటుగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, అడ్రస్ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి మొదలైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ విధంగా దరఖాస్తు పూర్తిచేసిన తర్వాత అర్హులు అయినటువంటి మహిళలకు రుణాన్ని అందించడం జరుగుతుంది.