
నకిరేకల్ శివారులోని తిప్పర్తి రోడ్డులో బుధవారం రాత్రి వైన్ షాప్ ముందు ఆగి ఉన్న లారీని బైకు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు మంగళపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, గణేష్ గా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.