
జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో మంగళవారం ఇద్దరు బాలురులు గల్లంతైయ్యారు. ఈ ఘటనలో సిద్దు(12) మృతదేహం బుధవారం సాయంత్రం లభ్యం కాగా, మరొక వ్యక్తి రాము కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిద్దు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాము ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.