
లారీ ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలైన ఘటన పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. నిజాంపేటకు చెందిన వెంకటేశ్వరరావు, పుప్పలత(60) ఓ ప్రవేట్ హాస్పిటల్ కు వెళ్లి, తిరిగి వస్తుండగా, లారీ ఢీకొట్టడంతో ఆమె లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.