అసెంబ్లీలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళ ప్రజాప్రతినిధులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు. అనంతరం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, ప్రభుత్వ విప్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖానాయక్, హరిప్రియ, సీతక్కతో కలిసి మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.