కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పుడు ఈప్రాజెక్టుకు మరో అరుదైన ఘనత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఈప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసింది.