మరో ఉరి వేసారు… ఇప్పటికి అయినా ఆగుతాయా…?

-

దేశంలో అత్యాచారాలకు, దేశంలో దొంగతనాలకు చావు ఉండదు అని సోషల్ మీడియాలో మొన్నామధ్య ఒక వ్యాఖ్య విస్తృతంగా వైరల్ అయింది. ఒకరకంగా ఈ మాట నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని చూస్తే దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, మహిళలపై దాడులు అన్నీ కూడా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా సరే దాడులు అత్యాచారాలు ఆగడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో దిశా చట్టం చేసిన రోజే ఇంటర్ విద్యార్ధి చిన్న పాపపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే దిశ హత్య కేసు నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపారు. ఆ వార్త దేశం మొత్తం వైరల్ అయింది. అయినా సరే ఆ తర్వాత అత్యాచారాలు దేశంలో ఎక్కడా ఆగలేదు. ఇక ఫిబ్రవరి ఒకటిన నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు.

అయినా సరే ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఏదోక ఘోరం జరుగుతూనే ఉంది. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు గా ఉన్న ఎమ్మెల్యేకు జీవితాంతం జైలు శిక్ష విధించారు. ఇక తాజాగా అదిలాబాద్ జిల్లాలో జరిగిన సమతా అత్యాచారం హత్య కేసులో దోషులు ముగ్గురుకి కోర్ట్ ఉరి శిక్ష విధించింది. వీరిని ఎప్పుడు ఉరి తీస్తారో తెలియదు గాని ఉరి తీయడం మాత్రం పక్కాగా జరుగుతుంది.

ఇక ఫోక్సో చట్టం సహా అనేక౦ వచ్చాయి. అయినా సరే ప్రజల్లో మార్పు రావడం లేదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ తమ కోరికలను తీర్చుకుంటున్నారు మ్రుగాళ్ళు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎంత మందికి ఉరి శిక్షలు విధిస్తున్నా న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కాల్చి చంపుతున్నా సరే మారడం లేదు జనం. మరి ఇంకెన్ని చట్టాలు చేస్తే మారతారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version