ధోని హెలికాప్టర్ వరల్డ్ కప్ షాట్ కొట్టి 9 ఏళ్ళు…!

-

275 పరుగుల టార్గెట్… సాధారణ వన్డేల్లో అయితే చాలా తక్కువ టార్గెట్. ప్రపంచ కప్ ఫైనల్ అయితే…? ఎంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా సరే అది చేధించడం కష్టమే. ఫైనల్ కి వెళ్ళింది అంటే ఆ జట్టు కచ్చితంగా బలంగానే ఉంటుంది కదా…? ఆ లక్ష్యాన్ని చెధించాలి అంటే చాలా ఓపిక అవసరం. చాలా ఓపిక కావాలి.. ఏ మాత్రం కంగారు పడినా సరే గుమ్మం ముందుకి వచ్చిన కప్… ఇంట్లోకి అడుగు పెట్టదు.

అలాంటి కప్ ని సాదరంగా ఎంతో స్వేచ్చగా, గౌరవ మర్యాదలతో టీం ఇండియా ఆహ్వానించింది మన ఇంట్లోకి. మొదటి సారి ఆహ్వానించడం ఈ తరానికి తెలియదు. రెండో సారి ఆహ్వానించడం మాత్రం గుర్తుండే ఉంటుంది. రెండో సారి ఆహ్వానించి, ఇంట్లోకి తీసుకొచ్చి సరిగా 9 ఏళ్ళు అయింది. 2011 ఏప్రిల్ 2 న భారత జట్టు రెండో సారి విశ్వ విజేతగా నిలిచింది. గంభీర్ పోరాట౦, ధోని దూకుడు, యువరాజ్, కోహ్లిల సహకారంతో…

మన జట్టు ప్రపంచకప్ ఫైనల్స్ లో విజయం సాధించింది. ఆదిలోనే సచిన్, సెహ్వాగ్ త్వరగానే అవుట్ అయినా ఆ తర్వాత గంభీర్, కోహ్లీ పోరాటం, గంభీర్, ధోని విలువైన భాగస్వామ్యం తో విశ్వ విజేతగా నిలిచింది భారత జట్టు. అలాంటి లక్ష్యాన్ని చేధించే క్రమంలో తొలుత కంగారు పడినా ఆ తర్వాత మాత్రం ఏ కంగారు లేకుండా… 48.2 ఒవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది ధోని సేన.

కుల శేఖర బౌలింగ్ లో ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్, నాన్ స్త్రైకింగ్ ఎండ్ లో ఉన్న యువరాజ్ మోకాళ్ళ మీద కూర్చుని భావోద్వేగానికి గురైన సన్నివేశం, రవి శాస్త్రి కామెంటరీ ఇలా అన్నీ ఇంకా వినపడుతూనే ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా దాన్ని చూసి పొంగిపోయారు. యువత రోడ్ల మీద బైక్ ర్యాలీలు చేసింది, అర్ధం కాని వాళ్ళు ఇదేం గోల అనుకున్నారు, మనకేం ఉపయోగం అని నవ్వారు…

ధోని సారధ్యంలో టీం ఇండియా గెలుచుకున్న ఆ కప్ ఆద్యంతం హీరో యువరాజే. ఫైనల్ లో గంభీర్ హీరో.. కాని ధోని విన్నింగ్ షాట్ కొట్టడం, రెండు మూడు పరుగులు గంభీర్ కంటే ఎక్కువ చేయడంతో అతని పేరే ఎక్కువగా వినపడింది. కాని ఆ ఫైనల్ మ్యాచ్ గంభీర్ కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్. మైదానంలో ఆ రోజు జహీర్ ఖాన్ సహా ఫీల్డర్లు అందరూ వేగంగా కదిలి భారత జట్టుకి కప్ అందించారు. ఆ తర్వాత రెండు ప్రపంచకప్పులో సెమీస్ లో భారత్ వేను తిరిగింది. అప్పటి కోచ్ గ్యారీ కిరిస్టెన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version