తెలంగాణ, ఏపీ పోస్టల్ సర్కిల్ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: గ్రామీణ్ డాక్ సేవక్ (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్)
తెలంగాణ సర్కిల్‌లో ఖాళీలు: 970. వీటిలో జనరల్-439, ఓబీసీ-176, పీహెచ్‌సీ-37, ఎస్సీ-119, ఎస్టీ-85, ఈడబ్ల్యూఎస్-114 పోస్టులు ఉన్నాయి.
ఏపీ సర్కిల్‌లో ఖాళీలు: 2707. వీటిలో జనరల్-1178, ఎస్సీ-286, ఎస్టీ-165, ఓబీసీ-593, ఈడబ్ల్యూఎస్-384, పీహెచ్‌సీ-101 ఖాళీలు ఉన్నాయి.
టీఆర్‌సీఏ: బీపీఎంకు లెవల్-1కు రూ.12,000/- లెవల్-2 పోస్టులకు రూ.14,500/-
ఏబీపీఎం/డాక్ సేవక్ లెవల్-1 పోస్టులకు రూ.10,000/-, లెవల్-2 పోస్టులకు రూ.12,000/-
వయస్సు: 2019, అక్టోబర్ 15 నాటికి 18- 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: పదోతరగతితోపాటు స్థానిక భాష వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం: పదోతరగతిలో వచ్చిన మార్కులు/గ్రేడ్‌ల ఆధారంగా చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 14
వెబ్‌సైట్: http://appost.in/gdsonline