రేవంత్ రెడ్డి బీజేపీ పై ఎదురుదాడి చేస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ, గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్దిపొందారు. ఆ ప్రాజెక్ట్ ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ రైతులకు న్యాయం చేస్తామని ప్రియాంకగాంధీతో చెప్పించారు. ఇప్పటివరకు న్యాయం చేయలేదు. అలైన్ మెంట్ మార్చలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఉత్తరభాగం రైతుల అలైన్మెంట్ మార్చాలని అడిగితే పట్టించుకోని సీఎం.. దక్షిణభాగంలో మాత్రం మార్చారు. దీనిలో ఆంతర్యం ఏంటి..? రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలని అనుకుంటున్నారా..? అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. రిజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డీపీఆర్ లోపభూయిష్టంగా ఉందని భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మీద ఎదురు దాడి చేస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఆయన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version