అల్హాబాద్‌ హైకోర్టులో 3,932 పోస్టులు.. అర్హత, అప్లై చేసుకునే విధానం ఇదే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. అలహాబాద్‌ హైకోర్టులో 3,932 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే… స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, గ్రూప్‌ ‘సీ’ క్లర్క్‌ క్యాడర్, డ్రైవర్‌ తదితర పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. వేరు వేరు పోస్టులకి వేరు వేరు విద్యార్హతలు వున్నాయి.

ఆరో తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ప్యాస్ అయిన వారు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలని అనుకునే వారికి స్టెనోగ్రాఫర్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. అలానే కంప్యూటర్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్‌ 13, 2022. ఇక ఖాళీల వివరాలని చూస్తే.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III పోస్టులు 1,186, గ్రూప్ ‘సి’ క్లరికల్ కేడర్ పోస్టులు 1,021, డ్రైవర్ (కేటగిరీ ‘సి’ గ్రేడ్ IV) పోస్టులు 26, గ్రూప్ ‘డి’ క్యాడర్ పోస్టులు 1,699 వున్నాయి. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఈఎస్‌ఎమ్‌ వారికి ఫీజు మినహాయింపు వుంది. పూర్తి వివరాలను https://www.allahabadhighcourt.in./ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version