ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

Anganwadi jobs: మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ లో పలు అంగన్‌వాడీ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చెయ్యవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. వైఎస్సార్‌ జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీ వున్నాయి. అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఇందులో వున్నాయి. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. దీనిలో మొత్తం 56 పోస్టులు ఖాళీ వున్నాయి.

Anganwadi Jobs

ఇక వయస్సు విషయానికి వస్తే… 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల వివరాలు చూస్తే.. అంగన్‌వాడీ వర్కర్ (12), అంగన్‌వాడీ హెల్పర్ (40), మినీ అంగన్‌వాడీ వర్కర్‌ (04) ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 7వ తరగతి, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కడప, పులివెందలు, జమ్మలమడుగు, బద్వే్‌లో ఉన్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఈ ఖాళీలు వున్నాయి.

ఇక జీతం వివరాలు చూస్తే.. వర్కర్‌ పోస్టుకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.7000 జీతంగా ఇస్తారు. దరఖాస్తులను నేరుగా సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో సబ్మిట్ చెయ్యాల్సి ఉంది. పదో తరగతిలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకి చివరి తేదీ 03-05-2023. 09-05-2023న ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పూర్తి వివరాలు https://kadapa.ap.gov.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version