మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
బ్రాంచి రిసీవబుల్స్ మేనేజర్ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. దీనితో మొత్తం 159 ఖాళీలు వున్నాయి. వయస్సు వివరాలను చూస్తే.. అభ్యర్ధుల వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పోస్టుల వివరాలను చూస్తే.. బ్రాంచి రిసీవబుల్స్ మేనేజర్ పోస్టులును ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలానే తప్పకుండ అనుభవం కూడా ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం చూస్తే.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వివరాల లోకి వెళితే.. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.600 చెల్లించాల్సి వుంది. అదే
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు అయితే రూ.100 కట్టాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 14, 2022. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలను https://www.bankofbaroda.in/ లో చూడచ్చు.