ఇంజినీరింగ్ చేసిన వాళ్లకి గుడ్ న్యూస్… గోవా షిప్‌యార్డులో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. సీనియర్‌ కన్సల్టెంట్ పోస్టులను భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్‌యార్డు భర్తీ చేస్తోంది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం నాలుగు ఖాళీలు వున్నాయి. ఇక వయస్సు ఎంత ఉండాలి అనేది చూస్తే.. అభ్యర్ధుల వయసు 63 ఏళ్లకు మించరాదు. పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అర్హతల వివరాలని చూస్తే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇక ఎలా అప్లై చెయ్యాలి అనేది చూస్తే.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యడానికి చివరి తేదీ మార్చి 31, 2022. కనుక ఈ లోగా అప్లై చెయ్యడమే మంచిది.

దరఖాస్తు చేయడానికి చిరునామా : The Chief General Manager (HR&A), Dr. B.R Ambedkar Bhavan, Goa Shipyard Limited, Vasco-Da-Gama, Goa – 403802.

Read more RELATED
Recommended to you

Exit mobile version