NTPC Limited: నోటిఫికేషన్ విడుదల…వివరాలు ఇవే…!

-

నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగం కోసం చూస్తున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబందించిన వివరాల లోకి వెళితే… ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా పోస్టులు ఉన్నాయని ప్రకటించడం జరిగింది.

తాజాగా నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ విభాగంలో మొత్తం 230 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 10లోగా అప్లై చేయాలని అనుకునే వాళ్ళు అప్లై చెయ్యొచ్చు. పోస్టులు వివరాలని చూస్తే… ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్(AE) పోస్టులు 200, అసిస్టెంట్ కెమిస్ట్ విభాగంలో 30 పోస్టులు ఉన్నాయి.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ట్స్రుమెంటేషన్ ఏదైనా విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి గమనించండి. అదే అసిస్టెంట్ కెమిస్ట్ విభాగంలో పోస్టులకు అప్లై చేయాలంటే 60 శాతం మార్కుల తో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. అలానే ఏడాది అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version