నా సోదరుడికి కరోనా లేదు: దివ్యాంకా త్రిపాఠి

-

బుల్లితెర హీరోయిన్ దివ్యాంకా త్రిపాఠి తన బ్రదర్ కు కరోనా వైరస్ లేదని తెలిపారు. భోపాల్ లోని తన ఇంటి ముందు కరోనా వైరస్ టెస్ట్, స్వీయ నిర్భందం అని అధికారులు బోర్డు పెట్టేసరికి చాలా మంది తన సోదరుడికి కోవిడ్19 పాజిటివ్ ఉందని అనుకున్నారని ఆమె అన్నారు.

13 రోజుల క్రితమే వృత్తి రిత్యా అతడు తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వచ్చాడు. వచ్చినప్పటి నుంచి స్వీయ నిర్భందంలోనే ఉన్నాడు. ఇప్పటి వరకూ తనలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు గుర్తించలేదు. ప్రతిరోజు ప్రభుత్వాధికారులు,వైద్యులతో పరీక్షలు చేయించుకుంటున్నాడని తెలిపారు.

గడచిన కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ విమానాల్లో పనిచేసే పైలెట్లు, ఇతర సిబ్బంది కూడా ప్రస్తుతానికి స్వీయ నిర్భంధంలోకి వెళ్ళారు. వాళ్లు స్వీయ నిర్భందంలో ఉన్నారంలో అర్థం.. వాళ్లకి కరోనా పాజిటివ్ ఉందని అర్థం కాదు. ఇది కేవలం జాగ్రత్తలు పాటించడం మాత్రమే అని దివ్యాంకా తెలిపారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version