Bigg Boss 3 Episode 1 అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3.. కంటెస్టెంట్లు వీళ్లే..!

-

యాజ్ యూజువల్.. హోస్ట్ నాగార్జున కుమ్మేశారు. మొదటి ఎపిసోడ్ అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా షోను హోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, నానిని మించిపోయారు.

హమ్మయ్య.. బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అయింది. కళ్లు కాయలు కాచేలా బిగ్ బాస్ అభిమానులు ఈరోజు వెయిట్ చేశారు. ఈరోజు బిగ్ బాస్ ప్రారంభం అవుతుందా? లేదా? అని అంతా తెగ టెన్షన్ పడ్డారు. కానీ.. ఆ టెన్షన్ కు తెర దించుతూ.. బిగ్ బాస్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ఇవాళ రాత్రి 9 గంటలకు స్టార్ మాటీవీలో అంగరంగవైభవంగా ప్రారంభమయింది.

యాజ్ యూజువల్.. హోస్ట్ నాగార్జున కుమ్మేశారు. మొదటి ఎపిసోడ్ అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా షోను హోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, నానిని మించిపోయారు.

మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ నాటీవీ.. అంటూ సీజన్ ను కొనసాగించారు. రెండో సీజన్ లో నాని.. నాని టీవీ అన్నారు. కానీ.. మూడో సీజన్ లో నాగార్జున మాత్రం మన టీవీ అంటూ మన ముందుకు వచ్చారు.

ఇక.. మొదటి ఎపిసోడ్ లో హౌస్ లోకి వచ్చిన వాళ్లలో మొదటి కంటెస్టెంట్ తీన్మార్ సావిత్రి. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నదని ముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ సావిత్రి(శివజ్యోతి) మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Savitri(Shiva Jyothi)

ఇక.. రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు రవికృష్ణ ఎంట్రీ ఇవ్వగా.. మూడో కంటెస్టెంట్ గా సోషల్ మీడియా స్టార్ ఆషు రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. నాలుగో కంటెస్టెంట్ గా టీవీ9 జర్నలిస్టు జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. ఐదో కంటెస్టెంట్ గా సీరియల్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ ఎంట్రీ ఇచ్చింది. ఆరో కంటెస్టెంట్ గా ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగింజ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏడో కంటెస్టెంట్ గా సీరియల్ నటి రోహిణీ ఎంట్రీ ఇచ్చింది. ఎనిమిదో కంటెస్టెంట్ గా బాబా బాస్కర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటి పునర్నవి భూపాలం, నటి హేమ, టీవీ యాక్టర్ అలీ రెజా, యూట్యూబ్ స్టార్, కమెడియన్ మహేశ్ విట్ట, పటాస్ యాంకర్ శ్రీముఖి,  హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షేరు.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Ravi Krishna
Ashu Reddy
tv9 jaffar
rahul sipligunj
Himaja
Rohini
Baba Bhaskar
Punarnavi Bhupalam
Hema
Ali Reza
Mahesh Vitta
Sreemukhi
varun sandesh and vithika sheru

Read more RELATED
Recommended to you

Exit mobile version