వితిక చేతిలో బ‌లైపోయిన వ‌రుణ్‌.. ఏం జ‌రిగిందంటే..

-

బిగ్‌బాస్‌ తెలుగు 3 సీజన్ ఇంకా 13 రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి పలకరించి వెళ్లారు. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హౌజ్‌మేట్స్‌ అంతా ఒక్కొక్కరు ఒక్కో గెటప్‌లో దర్శనమిస్తున్నారు. శ్రీముఖి ధరించిన గెటప్‌ తనకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయినట్లు కనిపిస్తోంది. తన హావభావాలు చూస్తుంటే ఇది మహానటి సావిత్రి పాత్ర అని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక శివజ్యోతి చంద్రముఖి క్యారెక్టర్‌లో విరుచుకుపడి నటించినట్లు తెలుస్తోంది. వరుణ్‌, వితికలు బాహుబలి చిత్రంలోని ప్రభాస్‌, అనుష్క గెటప్‌ వేశారు. కత్తి తిప్పుతూ రాణిలా హావభావాలు పలికిస్తోంది వితిక. బాహుబలి ఫేమస్‌ సీన్‌ ఒకటి కాపీ చేయాలని.. వరుణ్‌ వీపు మీద నుంచి వితిక నడుచుకుంటూ వెళ్లాలని చూసింది. కానీ వరుణ్‌ బ్యాలెన్స్‌ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో అందరూ పడీపడీ నవ్వారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version