Fathers day wishes: నాన్నా నువ్వే నా మొదటి హీరో..నీ కోసమే ఈ జీవితం..

-

మన జీవితం నాన్న ఇచ్చిన దైర్యంతో మొదలవుతుంది.. జన్మించిన నాటి నుంచి ప్రాణం పోయే వరకూ మన బెస్ట్ ఫ్రెండ్..పిల్లల కోసం అనునిత్యం ఆలోచించే వ్యక్తి. పిల్లలు గెలిస్తే తానే గెలిచినంతగా సంబరపడిపోతాడు. వాళ్లు ఓడిపోయి కుంగిపోతే భుజం తట్టి ప్రోత్సహిస్తాడు..

జీవితంలో సెటిలయ్యే వరకు, వారికొచ్చే ప్రతి కష్టంలోనూ భాగం పంచుకుంటాడు. ఇలా పిల్లల కోసం కష్టపడే నాన్నకంటూ ఓ ప్రత్యేక దినోత్సం ఉండాలి కదా. ఈ ఆదివారం (జూన్ 19) ఫాదర్స డే. మీ నాన్నకు ఇలా శుభాకాంక్షలు తెలపండి..

నా బెస్ట్ ఫ్రెండ్ మీరే

నా మంచి, చెడు, సంతోషం, దు:ఖం

విజయాలు, ఓటములు…సందర్భం ఏదైనా

నా పక్కన నిల్చున్నది మీరే నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే

ప్రపంచంలో ఏ బిడ్డకైనా మొదటిహీరో నాన్నే.

నువ్వే నా సూపర్ హీరోవి నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే

ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా

ఆ ప్రపంచాన్ని ఖాతరు చేయకుండా వెంట ఉండే వ్యక్తే నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే

పిల్లల గెలుపులో తన గెలుపును చూసుకునే వ్యక్తి నాన్న

కొవ్వొత్తిలా కరుగుతూ తన పిల్లలకు వెలుగు పంచే వ్యక్తి నాన్న

పిల్లల కోసం జీవితాన్నే ధారపోస్తున్న నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.

దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న

బిడ్డల భవిత కోసం తపన పడుతున్న నాన్నలందరికీ

హ్యాపీ ఫాదర్స్ డే

నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు

కానీ అపజయం మాత్రం కలగదు

హ్యాపీ ఫాదర్స్ డే

నాన్నంటే ఓ ధైర్యం

నాన్నంటే ఓ బాధ్యత

నాన్నంటే భధ్రత

నాన్నంటే భరోసా

అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే

ఇవే కాదు మీ నాన్నతో మీకు ఉన్న అనుబంధం గురించి, తనలో నచ్చినవి, నచ్చనివి..ఎలా వుంటే బాగుంటుంది అని రాతలో చెప్పండి..సంతోషం తో పొంగి పోతాడు..

ఇలాంటి రోజు విష్ చేయడం కన్నా ప్రతి రోజు ఇలానే ఉండండి.. అప్పుడు వృద్ధాస్రమాలు ఉండవు..మిత్రులకు, శ్రేయోభిలాషులకు హ్యాపీ ఫాదర్స్ డే..

Read more RELATED
Recommended to you

Exit mobile version