ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. అతనే ఆ ఇంటికి కాపాల, ఎలాంటి కష్టం వచ్చినా.. ఎవరైనా దాడులు చేసినా యజమాని ముందుండి కుటుంబాన్ని రక్షిస్తాడు. అలానే దేశాన్ని రక్షించడానికి మనకు మూడు ముఖ్యమైన దళాలు ఉన్నాయి. వాటినే త్రివిద దళాలు అంటారు. నింగి, నేల, ఆకాశం ఈ మూడు భాగాలను రక్షించేందుకు ఏర్పడ్డవే త్రివిధ దళాలు. భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క సైనిక దళాలు. ఇది మూడు వృత్తిపరమైన యూనిఫాం సేవలను కలిగి ఉంటుంది. భారత సైన్యం, ఇండియన్ నేవీ మరియు భారత వైమానిక దళం. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఈ దళాల గురించి ఇంకాస్త తెలుసుకుందాం.!
14 లక్షల పైబడిన సైన్యంతో భారత రక్షణ బలగాలు ప్రపంచంలోకెల్లా మూడవ అతిపెద్ద సైన్యం మన దేశానికి ఉంది. ఈ దళాలన్నిటికీ సర్వసైన్యాధ్యక్షుడిగా భారత రాష్ట్రపతి ఉంటాడు. ఈ సైనిక దళాల నిర్వహణ భారత ప్రభుత్వపు రక్షణ మంత్రిత్వ శాఖ చూస్తుంది. మూడు ప్రధాన దళాలకు వాటివాటి అధిపతులు ఉండగా, మూడింటినీ సమన్వయ పరుస్తూ సంయుక్త ప్రధాన సైన్యాధికారి ఉంటారు. త్రివిధ దళాధిపతులు ముగ్గురిలోకీ సీనియరు అధికారి ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.
భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో పాలుపంచుకున్నాయి. 1947, 1965, 1971 నాటి భారత పాక్ యుద్ధాలు, 1963 భారత చైనా యుద్ధం, భారత పోర్చుగీసు యుద్ధం, 1987 భారత చైనా ఘర్షణ, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణ వీటిలో కొన్ని. ప్రతి సంవత్సరం డిసెంబరు 7 న భారత్ సాయుధ దళాల దినోత్సవం జరిపి వీరోచిత సైనికులను సత్కరించుకుంటుంది.
భారత సైనిక దళం అంటే ఏంటి..?
భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడమే. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది వరకూ ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అంటే ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం, భారతదేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరతారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో ముఖ్యంగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాల్గొంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, పాకిస్తాన్‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి “ఇండియన్ ఆర్మీ” అని పేరు పెట్టబడింది.మొదటి కాశ్మీర్ యుద్ధం, గోవా, డామన్-డయ్యు ఆపరేషన్, భారత్ పాక్ యుద్దం 1965, భారత్ పాక్ యుద్దం 1971, కార్గిల్ యుద్ధంలో భారత సైనిక దళం పాల్గొంది.
భారత సైనిక దళం దగ్గర ఉన్న ప్రధాన క్షిపణులు…
ఆకాశ్
బ్రహ్మోస్
పృథ్వి
అగ్ని
ప్రహర్
త్రిషల్
నాగ్
భారత నావికా దళం
భారత నావికా దళం (ఇండియన్ నేవీ) 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ (INS)గా పేరు పెట్టారు.
దేశ రక్షణలో పాత్ర
ఆపరేషన్ విజయ్
భారత్-పాక్ యుద్ధం
సునామీ
భారత వైమానిక దళం
భారతదేశానికి చెందిన త్రివిధ దళాలలో అత్యంత ముఖ్యమైన సేనా విభాగము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అనేది భారత సాయుధ దళాల వైమానిక దళం. దాని సిబ్బంది విమానాల ఆస్తులు ప్రపంచంలోని వైమానిక దళాలలో మూడవ స్థానంలో ఉన్నాయి. భారత గగనతలాన్ని సురక్షితం చేయడం, సాయుధ పోరాట సమయంలో వైమానిక యుద్ధాన్ని నిర్వహించడం దీని ప్రాథమిక లక్ష్యం. ఇది అధికారికంగా 8 అక్టోబర్ 1932న బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క సహాయక వైమానిక దళంగా స్థాపించబడింది. భారత రాష్ట్రపతి IAF యొక్క సుప్రీం కమాండర్ హోదాను కలిగి ఉంటారు. IAFలో ఏ సమయంలోనైనా ఒకటి కంటే ఎక్కువ సేవలందించే ACMలు ఉండరు.
ప్రధాన పాత్రలు..
1950 నుండి, పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో IAF నాలుగు యుద్ధాల్లో పాల్గొంది. IAF చేపట్టిన ఇతర ప్రధాన కార్యకలాపాలలో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కాక్టస్ మరియు ఆపరేషన్ పూమలై ఉన్నాయి