ప్రధాని ప్రసంగం వేళలో ఖాళీ కుర్చీ దర్శనం.. అసలు ఏం జరిగిందంటే ?

-

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనలేదు. అయితే అతిథుల కోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీలో ఆయన పేరుతో ఉన్నటువంటి కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని కాంగ్రెస్ వెల్లడించింది. 

ఇదిలా ఉండగా.. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖర్గే ఓ ఎస్ఎంఎస్ ని పంపించారు. ప్రధాని మోడీ,  బీజేపీని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పదించారు.  ఖర్గే పంపించిన వీడియోలో దేశ ప్రగతి కోసం మాజీ ప్రధానులు చేసినటువంటి సేవలను కొనియాడారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రుతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించారు. అంతేకాదు.. బీజేపీ దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి పేరును కూడా ఖర్గే  ఎస్ఎంఎస్ లో పేర్కొనడం గమనార్హం.

ప్రతీ ప్రధాని దేశ పురోగతి తమవంతు సహకారాన్ని అందించారు. అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. ఇవాళ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని ఎంతో బాధతో చెబుతున్నాను. ముఖ్యంగా విపక్షాల గొంతు నొక్కేందుకు కొత్త సాధనాలను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు ఖర్గే. 

Read more RELATED
Recommended to you

Exit mobile version