దేశ రక్షణకు 2022-23 అధిక ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్ లో గతంలో కన్నా ఎక్కువ నిధులను కేటాయించింది. చైనా, పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగానికి నిధులను పెంచినట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు దేశీయంగా రక్షణ రంగ పరికరాలను, ఆయుధాలను తయారీకి ఎక్కువ ప్రాాధాన్యత ఇచ్చారు.
రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది మొత్తంగా రూ. 5.25 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది పోలిస్తే రూ. 47,000 కోట్లు ఎక్కువ. 2021-22 బడ్జెట్ లో రక్షణ రంగానికి 4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు దాదాపు 10% పెరిగాయి. మొత్తం రక్షణ రంగ కేటాయింపుల్లో సాయుధ బలగాల ఆధునీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో 68% దేశీయ వనరుల నుంచి కొనుగోళ్లకు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ. 1.35 లక్షల కోట్ల కంటే దాదాపు 13% ఎక్కువ. రక్షణ పెన్షన్ బడ్జెట్ కోసం రూ. 1.19 లక్షల కోట్లు కేటాయించారు.