చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఆచార్య చాణక్య సక్సెస్ గురించి కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో సక్సెస్ ని అందుకోవాలని అనుకుంటారు. మీరు కూడా సక్సెస్ ని అందుకోవాలనుకుంటే ఇలా చేయండి. ఇప్పుడు 2025 వస్తోంది. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరు సక్సెస్ ని అందుకోవాలని అనుకుంటారు. కొత్త సంవత్సరం మీరు కూడా సక్సెస్ ని పొందాలనుకుంటే వీటిని అనుసరించండి. డబ్బు గురించి చాణక్య ఎన్నో విషయాలు చెప్పారు. డబ్బు ఆదా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
సంక్షోభ సమయంలో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎటువంటి సహాయం చేయరు. కష్టాల నుంచి బయటపడేసే నిజమైన స్నేహితుడు డబ్బు. ఎప్పుడూ ఆలోచించకుండా డబ్బుని అనవసరంగా వృధా చేయకండి. అలాగే సమయం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోండి. చాణక్య సమయం చాలా విలువైందని చెప్పారు. కొత్త ఏడాది మీరు విజయాన్ని అందుకోవాలంటే ఖచ్చితంగా సమయానికి ప్రాధాన్యతను ఇవ్వండి. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి.
విమర్శలు వలన విజయానికి ఆటంకం కలుగుతుంది. చాణక్య ప్రకారం విమర్శలకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు విమర్శలను వినకండి. అలాగే కొత్త ఏడాదిలో ఎవరిని కూడా నిరాశపరచకండి, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే లోపాలను తొలగించుకోవడానికి ట్రై చేయండి. కొత్త ఏడాది మీ సామర్థ్యం మేరకు దానాలు చేయడం మంచిది. అర్హులైన వాళ్లకు విరాళాలు ఇవ్వండి. అర్హత ఉన్న వారికి విరాళం ఇస్తే వాటిని సక్రమంగా ఉపయోగిస్తారు ఇలా చేస్తే మీకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఇలా చాణక్య చెప్పినట్లు 2025లో పాటించారంటే కొత్త సంవత్సరం మీకు సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు.