ఏసీలకు మాస్కులుండవుగా… జాగ్రత్త!!  

-

కరోనా వైరస్ ను అరికట్టాలంటే… సోషల్ డిస్టెన్స్ పాటించాలి… ముఖానికి మాస్కులు ధరించాలి! దానివల్ల.. మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా లాలాజలం తుంపర్లు ఇతరులపై పడకుండా ఉంటాయి.. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు అని!! మరి… ఒక మీటరు దూరం ప్రయాణించే లాలాజలం యొక్క తుంపర్లకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటే… ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి వల్ల కరోనా వ్యాపించదా? ఈ ప్రశ్నకు షాకింగ్ సమాదానం చెబుతున్నారు శాస్త్రవేత్తలు!

 

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే భారత్ సహా ఇతర వేడి దేశాల్లో అటు ఆఫీసుల్లోనూ, ఇటు ఇల్లల్లోనూ కంపల్సరీగా ఏసీల వాడకం ఉంటుంది. ఈ క్రమంలో ఆఫీసుల్లోనూ.. రెస్టారెంట్స్లోనూ, హోటల్లూ, హాస్పటల్స్ లోనూ వాడే ఏసీల పరిస్థితిపై అమెరికా ఎమర్జింగ్ ఎంఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. చైనా శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో… ఏసీలు ఉన్న గదులను మొత్తం మూసేస్తారు కాబట్టి.. ఎయిర్ కండీషనర్లు కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తాయని తేలిందనేది ఆ కథనం సారాంశం!

ముగ్గురు నలుగురు మనుషులు ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నప్పుడు కాని, ఎదురెదురుగా ఉండి సంభాషించుకుంటున్నప్పుడు కానీ విడుదలయ్యే లాలాజలంలోని తుంపర్లు ఒక మీటర్ దూరం వరకూ మాత్రమే ప్రయాణిస్తాయి కానీ ఎయిర్ కండీషనర్ల గుండా వెళుతున్న గాలి దానిని చాలా దూరం వ్యాప్తి చేయడానికి సహాయపడుతుందనేది వారు చెప్పే క్లియర్ ఆన్సర్! సో… ఏసీల వల్ల కరోనా వ్యాపిస్తుందన్నమాట! సో… చల్లని గాలిని ఎగజిమ్మే ఈ ‘ఏసీ’లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందంటున్నారు… బీ కేర్ ఫుల్!!

Read more RELATED
Recommended to you

Exit mobile version