ఒకప్పుడు రాజకీయాలతో సందడి సందడిగా ఉండే బెజవాడ నగరం ఇప్పుడు కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతుంది. ప్రతీ రోజు కానూరు, బస్టాండ్, కృష్ణ లంక నుంచి ప్రసాదం పాడు వరకు, పెనమలూరు నుంచి రైల్వే స్టేషన్ వరకు సందడి సందడిగా ఉండే బెజవాడ రోడ్లు ఇప్పుడు కరోనా భయంతో అల్లాడిపోతున్నాయి. కనకదుర్గమ్మ తన బిడ్డలను అలా చూస్తూ ఉండిపోయింది.
రోజు రోజు కేసులు పెరగడంతో బెజవాడ ఇప్పుడు వణికిపోతుంది. ఇవాళ ఒక్క రోజే 16 కేసులు నమోదు అయ్యాయి. నగరంలోని కార్మికనగర్‌లో 8 కేసులు నమోదు కాగా, ఖుద్దుస్ నగర్, విద్యాధరపురం, గుప్తా సెంటర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరపేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదు అయింది. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. నేడు కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు నమోదు కాగా… అందులో 16 కేసులు బెజవాడలోనే ఉన్నాయి.
ఇప్పటి వరకు దాదాపు 60 కేసులు బెజవాడ నగరంలో అమోదు అయ్యాయి. దీనితో ప్రజల్లో భయం మొదలయింది. ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న కృష్ణ నదీ తీరం అలజడికి గురవుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి పంట కాలవ రోడ్డు వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా పోలీసులే. అవసరం ఉన్నా సరే జనాలు బయటకు మాత్రం రావడం లేదు.