సెకండ్ వేవ్: నవజాత శిశువులు, 1-5 సంవత్సరాల పిల్లలకి కూడా …!

-

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడు అందరినీ ఇబ్బంది లోకి నెట్టేసింది. రోజు రోజుకి లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా 1 నుండి 5 సంవత్సరాల పిల్లలకి కరోనా ఇప్పుడు ఎక్కువ వ్యాపిస్తోంది డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి నిజంగా ప్రమాదంగా ఉందని అన్నారు. కరోనా వైరస్ అప్పుడే పుట్టిన పిల్లలకు మరియు యువతకి కూడా ముప్పు తీసుకొస్తుంది.

2020 సంవత్సరం తో పోల్చుకుంటే ఈ సారి పిల్లల్లో ఐదు రెట్లు కరోనా వైరస్ వ్యాపిస్తోంది అని Dr Dhiren Gupta, Pediatric Intensivist at Sir Ganga Ram Hospital చెప్పడం జరిగింది. ఈసారి కరోనా వైరస్ బారిన పిల్లలు కూడా పడుతున్నట్లు చెప్పారు. ఈ కొత్త వేవ్ ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పటి వరకు 7 నుండి 8 మంది పిల్లలు ఆసుపత్రి లో చేరారని Dr. Ritu Saxena అన్నారు.

ఇది ఇలా ఉంటే ముఖ్యనగ చిన్న పిల్లలు, నవజాత శిశువులు కూడా వ్యాధి బారిన పడుతున్నారు. అలానే 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకుల లో 30 శాతం మంది కూడా వ్యాధి బారిన పడ్డారు అని సక్సేనా అన్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు 20 శాతానికి పైగా పెరిగాయి, గురువారం 112 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. పాజిటివిటీ రేటు 20.22 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version