తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా ప్రభుత్వ హాలిడే ఉండనుంది. దీంతో ఇవాళ కూడా… విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా… డిసెంబర్ 25వ తేదీ అంటే నిన్న, డిసెంబర్ 26 అంటే ఇవాల్టి రోజున రెండు రోజులపాటు తెలంగాణలోని విద్యాసంస్థలకు హాలిడే ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం…. డిసెంబర్ 25వ తేదీన మాత్రమే పబ్లిక్ హాలిడే ఇచ్చింది అక్కడి సర్కార్. ఇవాళ ఆప్షనల్ హాలిడే మాత్రమే అని వివరించింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థం. క్రైస్తవ విద్యార్థులు ఎక్కువగా ఉంటే హాలిడే ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని సమాచారం. అది స్థానిక విద్యాధికారుల పైన ఆధారపడి ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇవాళ మొత్తం హాలిడే గానే ఉండనుంది..