హీరోయిన్ నిక్కీ గల్రానికి కరోనా

-

కరోనా కేసులు భారత్ లో ఏమేరకు విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో రోజూ అరవై వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ కరోనా సెలబ్రిటీలని, నేతలను సైతం వదలడం లేదు. ఇప్పటికే సినీ రంగాలకి చెందిన ఎంతో మందికి కరోనా సోకగా తాజాగా ఓ హీరోయిన్‌కు సైతం కరోనా సోకింది.

తమిళ డబ్బింగ్ సినిమాలతో మన వాళ్ళకి బానే పరిచయం అయిన నిక్కీ గల్రానీకి ఇప్పుడు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. నాకు గత వారం కరోనా సోకిందన్న ఆమె, రికవరీకి దగ్గరలో ఉన్నానని పేర్కొంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి థాంక్స్ చెప్పిన ఆమె అందరినీ జాగ్రత్తగా ఉండాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version