కరోనా అనే విషక్రిమి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి? దీని నివారణకు ఏం చేస్తే మంచిది అనే విషయాలపై పెద్దలు, పండితుల అభిప్రాయాలు మనలోకం పాఠకుల కోసం..
కరోనా అనే విష వైరస్‌తో ప్రపంచం వణికి పోతుంది. ఈ సందర్భంలో కంటికి కనిపించని వైరస్ ప్రాణం తీస్తుంటే రక్షించేది కంటికి కనిపించని ఆ ఆదృశ్య శక్తి అయిన పరమాత్మ మాత్రమే. ఆ శక్తి అనుగ్రహం ఉంటే ఈ ఉత్పాతం నుంచి బయటికి వస్తామని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ సందర్భంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ అనవసరంగా సమయం వృథా చేయకుండా జ్ఞానం, సనాతన ధర్మంలోని మర్మాలు తెలుసుకుని ఆచరిస్తే తప్పక శుభం కలుగుతుంది.
ప్రతీ ఒక్కరూ ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలితా సహస్రనామం, శివపంచాక్షరి, రామతారకం, శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబం, ఇష్టదేవతరాధనతోపాటు పూర్తిగా ఆవుపేడతో తయరైన పిడుకలపై ఆవునెయ్యివేసి సాంబ్రాణి, ధూపం వేయడం చేయాలి.
తులసీ ఆకులను ప్రతీ ఒక్కరు దైవనామస్మరణతో స్వీకరించడం, వేప ఆకులను కనీసం ఒకటి లేదా రెండు నమలడం చేస్తే మంచిది అని పండితులు పేర్కొంటున్నారు.
ఇక వీటితోపాటు దుర్గా సూక్తం, దుర్గార్తి స్తోత్రం, శ్రీరామ రక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా, శివనామ స్మరణ ఇంకా ఆయా దేవతలను ఆరాధించడం చేస్తే మంచిది.
ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వ సూచనలను తూచ తప్పకుండా పాటించాలి.
ప్రపంచ వినాశకరిగా మారిన ఈ కరోనా మందు అందుబాటులోకి వచ్చే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
సనాతన ధర్మం చెప్పే సూక్ష్మవిషయాలను ఆయా ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు, పండితులు పేర్కొన్న వీడియోలు చూసి తెలుసుకుని వాటిని ఆచరించడం చేస్తే మంచిది.
శుచి, శుభ్రత వంటి విషయాలను పాటిస్తే తప్పక మంచి జరుగుతుంది.
ఇప్పటికైనా కరోనా నేర్పిన పాఠంతో మనం, మనతో పాటు పక్కవారు, లోకంలో అందరూ మంచిగా ఉండాలనే సనాతన ధర్మ సూక్తి ‘సర్వేజనా సుఖినోభవంతు’ కోసం ఎవరి మతనియమం ప్రకారం, ఎవరి ధర్మం ప్రకారం వారు ప్రార్థనలు, సంకల్పం చేస్తే తప్పక కరోనా అంతమవుతుంది. ఈ శక్తి భారతీయులకు ఉంది అని పెద్దలు పేర్కొంటున్నారు.