ప్రపంచం కరోనాకు ఎదురొడ్డి నిలబడుతుందా…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచం నెత్తిన కూర్చుంది ఈ వైరస్. అసలు భవిష్యత్తులో పరిస్థితి ఏంటీ అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. దీనికి మందు ఎప్పుడు కనుక్కుంటారు. ఈ వ్యాధి ఎప్పుడు అదుపులోకి వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఒక దేశం కాదు రెండు దేశాలు కాదు. ప్రపంచంలో ఉన్న 188 దేశాలు ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉన్నాయి. అది ఎలా చెప్తే అలా ఆడుతున్నాయి.

ఇరాన్, ఇటలీ, స్పెయిన్, అమెరికా, భారత్ ఇలా ఏ దేశం చూసినా సరే కరోనా తో పోరాడుతూనే ఉన్నాయి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలో పరిస్థితి దాదాపుగా చేయి దాటిపోయింది. ఇటలీలో ఒక్క రోజే కరోనా తీవ్రతకు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లో, స్పెయిన్ లో రెండు వేలకు దగ్గరగా ఉన్నాయి మరణాలు. ఇటలీ లో అయితే 80 ఏళ్ళు పైబడిన వారికి కరోనా చికిత్స చేయడం లేదు.

ఇటలీలో ఎక్కడ చూసినా సరే శవాల దిబ్బ మాత్రమే కనపడుతుంది. రోగుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోతుంది. పెరుగుతున్న కేసులతో అక్కడి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇది ఎప్పుడు అదుపులోకి వస్తుందో అర్ధం కావడం లేదు. చైనాలో కరోనా పుట్టినా ఇటలీ లో మాత్రం చుక్కలు చూపిస్తుంది. ప్రపంచంలోనే పౌరులకు అత్యంత భద్రత ఉన్న దేశం ఇటలీ.

ఆర్ధికంగా, సామాజికంగా, వైద్య పరంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇటలీ ప్రపంచానికి అంటే ముందు ఉంది. అన్ని దేశాలు కూడా ఆ దేశాన్ని చూసి నేర్చుకునే పరిస్థితి. అలాంటి దేశమే ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే ఇక దీనిని అదుపు చేయడం సాధ్యమేనా…? ఇది ఏ విధంగా అదుపులోకి వస్తుంది…? ప్రపంచ దేశాలు దీన్ని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందా…? ప్రపంచానికి కరోనా తో పోరాడే సత్తా ఉందా…? కాలమే సమాధానం చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version