BREAKING NEWS: హీరో శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్…

-

కరోనా కమ్మేస్తోంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని రోజలు నుంచి లక్షణాలు ఉన్నాయమని వెల్లడించారు. తనతో సన్నిహితం మెలిగిన వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ వరస కరోనా కేసులను ఎదుర్కొంటోంది. తాజాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మహేష్ బాబుతో పాటు సీనియర్ యాక్టర్లు శోభన, మీనా కూడా కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు త్రిష, కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ లు కరోనా బారినపడి కోలుకున్నారు. మరో వైపు కోలీవుడ్ ను కూడా కరోనా కలవరపరుస్తోంది. విక్రమ్, కమల్ హాసన్, వడివేలు, సత్యరాజ్ వంటి ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version