జీవితంలో ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించిన సరే చివరికి సంతోషంగా ఉండడం మాత్రం ఎంతో అవసరం. కనుక వయసు పెరిగే కొద్దీ ఆనందాన్ని కూడా పొందాలనుకుంటే ఈ అలవాట్లను తప్పకుండా చేసుకోండి. జీవితంలో ప్రతిదీ ఎంతో పాజిటివ్ గా ఉండదు కనుక ఎటువంటి సంఘటనలు ఎదురైన నిరాశపడకూడదు. అంతేకాకుండా అక్కడితో ఆ విషయాన్ని వదిలేయాలి. దానికోసం మళ్లీ ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం అనవసరం. ఎటువంటి నెగటివ్ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, దాన్ని అక్కడితో విడిచిపెట్టేయడం ఎంతో మేలు.
జీవితంలో జాబ్ లో ఎంతో బిజీ గా ఉండి ఒత్తిడికి గురైనసరే మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలా చేయడం వలన మానసిక ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పైగా నిద్రలేమి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కనుక కొంత సమయాన్ని మీకు నచ్చినట్టు గడపండి. ముఖ్యంగా సమయానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి కేటాయించండి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రతి నిమిషాన్ని ఎంతో సంతోషంగా గడపాలి మరియు డైలీ రొటీన్ లో కొన్ని మార్పులను చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి పని పర్ఫెక్ట్ గా అవ్వదు అని గుర్తుంచుకోండి. దేన్నైనా సాధించడం అసలు సులువు కాదు మరియు అది ఎంతో పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకోకండి.
చాలా మంది ఇతరులకు వద్దు అని చెప్పలేక ప్రతి దానికి అంగీకరిస్తారు. ఇలా చేయడం వలన అస్సలు సంతోషంగా ఉండలేరు. జీవితంలో ఎప్పుడైనా ఇతరులతో పోల్చుకుంటే ఆనందాన్ని అస్సలు పొందలేరు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. దాంతో ఇతరులు షేర్ చేసిన పోస్టులను చూసి మన జీవితంతో పోల్చుకుని ఎన్నో సమస్యలను పెంచుకుంటున్నారు. కనుక ఎవరి జీవితంతో మనం పోల్చుకోకూడదు, మనకు నచ్చినట్లు ఆనందంగా సమయాన్ని గడపడం ఎంతో అవసరం. ఇలా చేయడం వలన మన జీవితం ఎంతో సంతృప్తిగా, ఆనందంగా ఉంటుంది.