కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల ఫేక్ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో ఈ ఫేక్ వార్తలని అదుపు చేయడం కష్టమై పోతుంది. తాజాగా మరో వార్త వచ్చింది. Covipri అనే ఒక మందు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ కోవిప్రి రెమిడీసీవర్ అని దీనిని తీసుకోవడం వల్ల కరోనా తగ్గిపోతుందని అంటున్నారు. ఈ ప్యాకెట్ మీద చూస్తే.. ఇది రెమిడీసీవర్ అని రాసి ఉంది. దీనిని ఫేస్ బుక్ లో కూడా విపరీతంగా షేర్ చేయడం జరిగింది.
ఫ్యాక్ట్ చెక్: ఈ రెమిడీసీవర్ ఇంజక్షన్ ఫేక్. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. covipri అనే పేరుతో ఏ రెమిడీసీవర్ ఇంజక్షన్ లేదు. ఈ ఇంజెక్షన్లు ఇంకా పలు చోట్ల అమ్ముతున్నారు ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఈ ప్యాకెట్ మీద వ్యాకరణ తప్పులు కూడా ఉన్నాయి. “For used in India only. Not for export”, అని ఇంగ్లీషులో రాసి ఉంది. అదే విధంగా “It is a dangerous to take this preparation Except under medical supervision” అని తప్పు లైన్స్ కూడా రాయడం జరిగింది.
ఢిల్లీ పోలీసులు ఫేక్ మెడిసన్ ని అమ్ముతున్న ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి వాటికి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ ఫేక్ వాటిని సోషల్ మీడియా లో చూస్తే షేర్ చెయ్యద్దు.