ఈ మధ్య కాలంలో ఏది ఫేక్ వారితో, ఏది నిజమైన వారితో తెలియడం లేదు. తాజాగా ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది. ఒక వీడియోలో కప్పింగ్ థెరపీ ద్వారా ఒంట్లో ఉండే వ్యాక్సిన్ కంటెంట్ ని తొలగించడం జరిగింది. చేతి మీద చిన్నది కట్ చేసి తీసుకున్న వ్యాక్సిన్ ని బయటికి తొలగించడం జరిగింది. అయితే నిజంగా ఒకసారి వేసుకున్న వ్యాక్సిన్ ను తిరిగి మళ్ళీ బయటకి ఈ కప్పింగ్ థెరపీ ద్వారా తీయొచ్చా అనేది చూస్తే..
పూర్వకాలంలో అయితే కప్పింగ్ థెరపీ ద్వారా థెరపిస్టులు చర్మానికి కప్ ని పెట్టి ఒంట్లో ఉండే దానిని తొలగించే వారు. అయితే దీనిని వివిధ రకాల వాటికి ఉపయోగించే వారు. నొప్పిని తొలగించడానికి, బ్లడ్ ఫ్లో, ఇంఫ్లమేషన్, రిలాక్సేషన్ వంటి వాటి కోసం ఉపయోగించేవారు.
కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి అంతా వ్యాక్సిన్లు వేయించుకున్నాము. అయితే వేయించుకున్న వ్యాక్సిన్ ని ఈ థెరపీ ద్వారా తొలగించొచ్చ అనేది చూస్తే… డాక్టర్ హస్సన్ కప్పింగ్ స్పెషలిస్ట్ దీని గురించి చెప్పారు అని విశ్వాస్ న్యూస్ చెప్పింది.
కప్పింగ్ థెరపీ ద్వారా చిన్న బ్లడ్ వేసి ని చర్మం కింద డీటాక్సిఫికేషన్ కోసం వాడతారని.. అయితే బ్లడ్ లో ఉండే స్పెసిఫిక్ కంటెంట్ ని అది తొలగించాడు అని అన్నారు. ఇలా కప్పింగ్ థెరపీ ద్వారా వ్యాక్సిన్ తొలగించడం అనేది ఫేక్ అని ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని తెలుస్తోంది. ఇటువంటి ఫేక్ వార్తలు చూసి నమ్మొద్దు మోసపోవద్దు.